భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు
గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.44 కోట్లకుపైగా అంటే 4,49,91,380కు చేరుకుంది. తాజా మరణాలతో కలిపి మృతుల సంఖ్య 5,31,878కు పెరిగింది. ప్రస్తుతం 3,502 గా యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
india
జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైందని ఆరోగ్యశాఖ వివరించింది. మరోవైపు జనవరి 2021లో దేశ వ్యాప్తంగా టీకాలు ప్రారంభించిన నాటి నుంచి దాదాపుగా 220.66 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు దేశ ప్రజలందరికీ అందించినట్లు స్పష్టం చేసింది. శుక్రవారంతో పోల్చితే శనివారం 2 మరణాలు అధికంగా సంభవించాయి. కిందటి రోజు కంటే 30 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా దేశంలో క్రమంగా కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడిస్తోంది.