దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు
వ్రాసిన వారు
Stalin
May 17, 2023
12:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24 గంటల్లో 1,021 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4.49 కోట్లకు పెరిగారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,393గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03శాతంగా ఉన్నాయి. కరోనాతో తాజాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,794 చేరినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 92.80కోట్ల పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 2,661 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నట్లు కేంద్రం చెప్పింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి