తదుపరి వార్తా కథనం
    
     
                                                                                దేశంలో కొవిడ్ తగ్గుదల.. కొత్తగా 267 కొవిడ్ కేసులు,2 మరణాలు నమోదు
                వ్రాసిన వారు
                TEJAVYAS BESTHA
            
            
                            
                                    Jun 02, 2023 
                    
                     01:45 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
గడిచిన 24 గంటల్లో భారత్ లో 267 కరోనా కొత్త కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. గురువారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరుకుంది. తాజా మరణాలతో కలిపి మృతుల సంఖ్య 5,31,874కు పెరిగింది. ప్రస్తుతం 3, 736గా యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 4.44 కోట్ల మంది రోగులు క్రమంగా కోలుకుంటున్నారని, రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైందని వివరించింది. జనవరి 2021లో దేశ వ్యాప్తంగా టీకాలు ప్రారంభమైన నాటి నుంచి 220.66 కోట్ల వ్యాక్సిన్‌లు పంపిణీ చేశామని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరోనాతో కొత్తగా ఇద్దరు మృతి
India records 267 new coronavirus infections, active cases decrease to 3,736 from 3,925: Union health ministry
— Press Trust of India (@PTI_News) June 2, 2023