డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.
ఈ మేరకు శుక్రవారం దిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ సంజయ్ మూర్తి యూజీసీ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేశారు.
అనంతరం ఇన్‌స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ రెగ్యులేషన్-2023 పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ప్రకటించారు.
జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 2019 నాటి రూల్స్ ను రద్దు చేశామని, దాని స్థానే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు.
UGC REGULATIONS 2023
డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
1. డీమ్డ్ వర్సిటీ హోదా కోరుకునే సంస్థలకు వరుసగా 3 ఏళ్ల పాటు 3.01 సీజీపీఏతో న్యాక్ - ఏ గ్రేడ్ , లేదా ఆ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో రెండో వంతున ఎన్‌బీఏ అక్రిడిటేషన్ లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్ రూపొందించిన స్పెషల్ కేటగిరీ ర్యాంకుల్లో టాప్ - 50లో లేదా ఓవరాల్ ర్యాంకుల్లో టాప్ - 100లో ఉండాలి.
2. విద్యాలయాలను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిపుణుల కమిటీ ఆయా వర్సిటీల్లో సౌకర్యాలు, పత్రాలను పరిశీలించి, భాగస్వాములతో మాట్లాడి ఫైనల్ గా ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ఈ ప్రక్రియ అంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తారు.
UGC
ఆఫ్ క్యాంపస్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు
3. సముదాయంగా విద్యా సంస్థలను నడుపుతున్న వ్యవస్థ కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
4. కనీసం గ్రేడ్ ఏ, అంతకుమించి గ్రేడ్‌లు పొందిన డీమ్డ్ వర్సిటీలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల కేటగిరీలో 1 నుంచి 100 ర్యాంకులు పొందిన వారు, ఆఫ్ క్యాంపస్ సెంటర్లు పెట్టుకోవచ్చు.
స్పెషల్ కేటగిరీలో డీమ్డ్ హోదా పొందిన సంస్థలు ఆ హోదా పొందిన 5 ఏళ్ల తర్వాత ఆఫ్ క్యాంపస్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
5. న్యాక్‌లో ఏ గ్రేడ్ కంటే తక్కువ గ్రేడ్ పొందిన సంస్థలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో 100కిపైన ఉన్న సంస్థల పని తీరును యూజీసీ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. విఫలమైతే కొత్త కోర్సులు ప్రారంభానికి ఇచ్చిన పర్మిషన్లను ఉపసంహరిస్తారు.
UGC
విద్యార్థులకు అకడెమిక్ క్రెడిట్స్ బ్యాంక్ ఏర్పాటు
6. డీమ్డ్ విశ్వవిద్యాలయాలను ప్రారంభించే కోర్సులు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ పరిధిలోకి వస్తే గనక ఫీజులు, సీట్ల సంఖ్య విషయంలో ఆయా సంస్థలు నిర్దేశించే రూల్స్ నే పాటించాలి.
7. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన వర్గాలకు చెందిన మెరిట్ స్టూడెంట్స్ కు డీమ్డ్ వర్సిటీ రుసుముల్లో రాయితీలు, స్కాలర్ షిప్ లతో కూడిన సీట్లు కేటాయింపులు జరపొచ్చు.
8. తప్పనిసరిగా విద్యార్థులకు అకడెమిక్ క్రెడిట్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. సదరు స్కోర్‌ను వారి డిజిటల్ లాకర్స్‌లో భద్రపరచాలి. ఈ విద్యాసంస్థలు ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు స్టూడెంట్స్ కు అందిచొచ్చు.
UGC
విద్యార్థుల ఎంపిక వివరాల రికార్డు తప్పనిసరి
9. అడ్మిషన్ల ప్రారంభానికి కనీసం 60 రోజుల ముందే ఈ సంస్థలు వర్సిటీల ప్రాస్పెక్టస్‌ను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. రుసుములు, వాటి రీఫండ్ విధానం, ఒక్కో కోర్సులోని సీట్లు, ప్రవేశ అర్హతలు, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ప్రోసీడ్యూర్ నున అందులో స్పష్టంగా వివరించాలి.
విద్యార్థుల ఎంపికకు సంబంధించిన మొత్తం వివరాల రికార్డును తప్పనిసరిగా చేపట్టాలి. ఆయా రికార్డులను వెబ్‌సైట్‌లో చూపించాలి. ఇలా కనీసం అయిదేళ్లపాటు వాటిని నిలువచేయాలి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) ఈ మేరకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు విధించిన మార్గదర్శకాల్లో సమూలంగా మార్పులు తెస్తూ, కొత్త రూల్స్ ను విడుదల చేసింది.