ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే
ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. దాదాపు 5 రాష్ట్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ను పెట్టారు. ఒడిషాతో పాటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కర్ణాటకల్లో ఈ సహాయ కేంద్రాల ద్వారా రైల్వే సమాచారం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 237 మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. కాలం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగడం సర్వత్రా కలవరానికి దారితీస్తోంది. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రుల్లో వందలాది జనం పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంటోంది.
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు :
హెల్ప్ లైన్ నంబర్లు : భద్రక్ : 8455889900 జాజ్ పూర్ కియోనిహార్ రోడ్ : 8455889906 కటక్ : 8455889917 భువనేశ్వర్ : 8455889922 కుర్దా రోడ్ : 6370108046 బ్రహ్మపూర్ : 89173887241 బలుగాన్ : 9937732169 పలాస : 8978881006 ఒడిషా ప్రభుత్వం : 06782-262286 హౌరా : 033-26382217 ఖరగ్‌పూర్ : 8972073925 బాలేశ్వర్ : 8249591559 చెన్నై: 044-25330952 విశాఖ : 08912 746330, 08912 744619 విజయనగరం : 08922-221202, 08922-221206 విజయవాడ : 0866 2576924 రాజమండ్రి : 0883 2420541 రేణిగుంట : 9949198414 సికింద్రాబాద్ : 040 27788516 తిరుపతి : 7815915571 నెల్లూరు : 08612342028