Page Loader
ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 
18 రైళ్ల రద్దు.. పలు రైళ్ల దారి మళ్లింపు

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 03, 2023
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు టాటానగర్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు. హౌరా - పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హౌరా - బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హౌరా - చెన్నై మెయిల్‌ (12839), హౌరా -సికింద్రాబాద్‌ (12703), హౌరా - హైదరాబాద్‌ (18045), హౌరా - తిరుపతి (20889), హౌరా - పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హౌరా - సంబల్‌ పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి - పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయని రైల్వే ఆఫీసర్లు స్పష్టం చేశారు.

Odisha Railway Accident

గోవా - ముంబయి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం వాయిదా

బెంగళూరు - గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ పరిధిలోని చెన్నై సెంట్రల్‌ - హౌరా (12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా - షాలిమార్‌ (18048), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) వారాంతపు రైళ్లను కటక్‌ మీదుగా దారి మళ్లించామన్నారు. ఘటనతో గోవా - ముంబయి వందేభారత్‌ నూతన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ముందుస్తు షెడ్యూల్ మేరకు శనివారం ఉదయం వీడియో అనుసంధానం ద్వారా ప్రధాని ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు దుర్ఘటనపై ఏఐసీసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఒడిషా ప్రజలకు తోడుగా నిలవాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు.