Page Loader
ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు 

ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు 

వ్రాసిన వారు Stalin
Jun 03, 2023
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని శుక్రవారం కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పి ఓ గూడ్స్ రైలును ఢీకోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 237 మంది మృతి చెందగా, 900 మంది గాయపడ్డారు. ఇంకా చాలా మంది ప్రయాణికులు సూపర్‌ఫాస్ట్ రైలు బోల్తా పడిన కోచ్‌లలో చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ఏఎఫ్), అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొనసాగుతున్న సహాయక చర్యలు