
UNESCO: తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి భక్తులకి సంతోషకరమైన వార్త అందింది. దేవ దేవుడు కొలువైన తిరుమల కొండలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో తన తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలను చోటు ఇచ్చింది. ఇదే విధంగా, విశాఖలోని భీమిలి ప్రాంతంలోని ఎర్రమట్టి దిబ్బలకు కూడా యునెస్కో గుర్తింపు దక్కింది. దేశంలోని ఏడు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో చేర్చింది. ఈ వార్త తెలిసి కేవలం తిరుమల శ్రీవారి భక్తులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Details
యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు లభించిన ప్రాంతాలు
నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్ మహారాష్ట్రలోని పంచగాని, మహబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్ కేరళలోని వర్కాల కర్ణాటకలోని ఉడుపి సెయింట్ మెరీస్ ఐలాంట్ క్లస్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలు
Details
తిరుమల కొండల ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత
తిరుమల కొండలు విశేష ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యంతో ప్రసిద్ధి చెందాయి. భక్తుల నమ్మక ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి ఏడు పడగలలో నిద్రించే కొండలలో తిరుపతిలోని ఏడు కొండలు ఉన్నాయి. ఇవి: నారాయణాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వృషభాద్రి, అంజనాద్రి. ప్రతి కొండకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1830లో ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇక్కడి విశేషాలను రాసి జనాలకు పరిచయం చేశారు. తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ అనేక అరుదైన మొక్కలు, జంతువులు ఉన్నాయి. వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది, వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కొండల్లోని అనేక జలపాతాలు భక్తులకు, పర్యాటకులకు కనువిందుగా నిలుస్తాయి. పురాణాల ప్రకారం, ఇక్కడ ఎంతోమంది రుషులు తపస్సు చేశారు.
Details
విశాఖ ఎర్రమట్టి దిబ్బల ప్రాముఖ్యత
విశాఖపట్టణం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిని వేల సంవత్సరాలుగా వాతావరణ ప్రభావంతో ఏర్పడిన ఇసుక రేణువుల ద్వారా ఏర్పడ్డాయని చెబుతున్నారు. భీమిలి తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10-90 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దిబ్బలు, ఆరు వేల సంవత్సరాల క్రితం సముద్రం వెనక్కి తగ్గడంతో ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షం, గాలి ప్రభావంతో ఇవి లోయలుగా మారాయి. దిబ్బల్లోని ఇసుక రేణువుల వయసు మూడు వేల సంవత్సరాలుగా ఉంది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భావిస్తున్నారు.