
luknow Air port: విమానం టైర్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో ఎయిర్‌పోర్ట్‌లో సీటూ ప్రమాదం జరగడం నుంచి విమానం తప్పించుకున్న సంఘటనలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం చోటుచేసుకున్న విషయం కూడా గుర్తుకు వస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ వైపు బయలుదేరిన విమానం టేకాఫ్ చేసిన వెంటనే కుప్పకూలి పేలింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అంతేకాకుండా, కింద ఉన్న ప్రాంతంలో 33 మంది మరణించారు.
Details
ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు
ఇప్పటికి లక్నో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సంఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరింది. అయితే, ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు బయటకు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానాన్ని ట్యాక్సీ వేకీ వద్ద నిలిపిన వెంటనే, 250మంది ప్రయాణికులను సురక్షితంగా దింపారు. ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్‌లో మంటలు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. ఎలాంటి గాయాలూ జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తిగానే విచారణ చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చర్యలు తీసుకుంటామని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.