ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎలక్షన్లకు కావాల్సినంత సమయం ఉంది. అయినా రాష్ట్రంలో ఎన్నికల సందడిషురూ అయ్యింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లనూ పార్టీలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమళదళం అగ్రనేతలు ఆంధ్రపై తమ నజర్ పెట్టారు. ఏపీలో పర్యటించేందుకు రెఢీ అవుతున్నారు. అయితే ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. వైజాగ్ నగరంలోనే పలు కార్యక్రమాలకు హాజరై అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈనెల 10న జేపీ నడ్జా తిరుపతి టూర్
ఇంకోవైపు పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగుతుందని కమళదళ నేతలు చెబుతున్నారు. అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన చీఫ్ ఇప్పటికే పునరుద్ఘాటించారు. మరోవైపు అమిత్ షా తర్వాత జూన్ 10న పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తిరుపతికి విచ్చేయనున్నారు. భాజపా, జనసేన, తెదేపాలు కలిసి సంయుక్తంగా పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో జనసేనాని ఉన్నట్టు వినికిడి. 9 ఏళ్ల ఎన్టీఏ పాలనకు సంబంధించి ప్రధాని మోదీ ఏపీకి ఏం చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులిచ్చారు అనే అంశాలను బహిరంగ సభల ద్వారా అమిత్ షా, జేపీ నడ్డా వివరించనున్నట్లు సమాచారం.