LOADING...
CM Chandrababu : ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?
ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?

CM Chandrababu : ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెన్షన్‌లు, CMRE ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరుకోవాలనే ముఖ్య ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉండి, సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రజాప్రతినిధులు ముందుండాలని, లేకపోతే ప్రభుత్వ లక్ష్యాలు నష్టపోతాయని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హాజరు కాని ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయనున్నారు.