
మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.
శుక్రవారం స్టాన్‌ఫోర్డ్ 'ది ఇండియా డైలాగ్' సెషన్‌లో ఆర్థిక వ్యవస్థపై టీకా ప్రభావం, సంబంధిత విషయాలపై వర్చువల్‌గా మంత్రి కీలకోపన్యాసం చేసారు.
జనవరి 30, 2020న కరోనాను డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించబడటానికి ముందే ప్రధాని మోదీ ముందస్తు చర్యలపై దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.
భారత్ చేపట్టిన టీకా డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపుపొందినట్లు వివరించారు. ఇప్పటివరకు 2.2 బిలియన్లకు పైగా డోస్‌లు పంపిణీ చేసినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం
800మిలియన్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ: ఆరోగ్య మంత్రి
కరోనా సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు పీఎంజీకేఏవై కింద మోదీ ప్రభుత్వం 800మిలియన్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేసినట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా వివరించారు.
టీకా పంపిణీ కార్యక్రమం 18.3 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు.
కరోనా సమయంలో భారత్ చాలా చురుగ్గా వ్యవహరించినట్లు చెప్పారు. 2020 మార్చి 29 నాటికి డ్రగ్స్, వ్యాక్సినేషన్, లాజిస్టిక్స్ మొదలైన మహమ్మారి నిర్వహణలోని వివిధ అంశాలపై అంకితభావంతో దృష్టి సారించేందుకు ప్రభుత్వం 11 సాధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జెనోమిక్ నిఘా కోసం 52 ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వైరస్ వైరియంట్లను గుర్తించడంలో ఈ ల్యాబ్‌లు సాయపడుతాయని చెప్పారు.