బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ
అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని, భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు
జార్జ్ సోరోస్‌కు ప్రతి భారతీయుడూ సమాధానం ఇవ్వాలి
భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ జార్జ్ సోరోస్ చెప్పారు. జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం సిగ్గుచేటు అని స్మృతి ఇరానీ అన్నారు. జార్జ్ సోరోస్‌కు తగిన సమాధానం ప్రతి భారతీయుడూ ఇవ్వాలని కోరారు. ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారని, ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆమె తెలియజేశారు.