
Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నాడు.
ఇప్పటికే ఏడు ఉన్న ఏడు విమానాశ్రయాలతో కలిపి 14కు విస్తరిస్తామన్నారు.
రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్నినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమీక్ష చేశామన్నారు.
నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారని తెలిపారు. దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Details
విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ముఖ్యంగా ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే శాఖ తరుఫున సహకారమందిస్తామన్నారు.
మరోవైపు శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామన్నారు.
కొత్త ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలను పరిశీలించి, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
Details
పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు ప్రణాళికలు
ఇక పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
ప్రయివేటు విమానాశ్రయ నిర్వాహకులతో చర్చించి, పౌర విమానాయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హాబ్‌గా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని, లాజిస్టిక్ హబ్‌గా చేయడంలో విమానాశ్రయాల పాత్ర కీలకమన్నారు.