మన్‌సుఖ్ మాండవీయ: వార్తలు

Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్‌కు కేంద్రం పిలుపు

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Mansukh Mandaviya : CPR టెక్నిక్‌పై శిక్షణ పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి (Video) 

దిల్లీలో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) టెక్నిక్‌పై బుధవారం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.

వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం

వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు.

దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం 

జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం తెలిపారు.

10 Apr 2023

కోవిడ్

కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రకటించింది.

7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.

24 Feb 2023

కోవిడ్

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

27 Dec 2022

కోవిడ్

కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.