LOADING...
చైనాతో పాటు మరో 5దేశాలనుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసిన కేంద్రం
ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసిన కేంద్రం

చైనాతో పాటు మరో 5దేశాలనుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసిన కేంద్రం

వ్రాసిన వారు Stalin
Dec 29, 2022
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రం కొత్త కరోనా మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

కరోనా

కొత్త వేవ్ మొదలైందా?

చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల్లో రెండు శాతం మందికి రాండమ్ పరీక్షలు చేయాలని డిసెంబర్ 24న కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు బయటపడుతున్నాయి. పాజిటివ్‌గా తేలిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపుతున్నారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత్‌లో కొత్త వేవ్ మొదలైందని, రాబోయ్ 30 నుంచి 35 రోజుల్లో వైరస్ వ్యాప్తి పేరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే దేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.