Page Loader
Mansukh Mandaviya : CPR టెక్నిక్‌పై శిక్షణ పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి (Video) 
CPR టెక్నిక్‌పై శిక్షణ పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి

Mansukh Mandaviya : CPR టెక్నిక్‌పై శిక్షణ పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి (Video) 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2023
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) టెక్నిక్‌పై బుధవారం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి ఎస్‌పి సింగ్ బాఘేల్, భారతి ప్రవీణ్ పవార్‌లతో పాటు ఆరోగ్య మంత్రి సిపిఆర్ టెక్నిక్‌లో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. మన హృదయాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం లాంటివి చేయాలన్నారు. కానీ గుండె ఆగిపోయినప్పుడు CPR అనేది రోగిని సకాలంలో రక్షించగలదని.. ఎవరికైనా గుండె ఆగిపోయినప్పుడు.. ఎక్కడైనా, ఈ చర్యలు తీసుకోవడం ద్వారా అతన్ని రక్షించవచ్చని అన్నారు.

Details 

గుండెపోటు బాధితుల్లో 80 శాతం మంది 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే

నేడు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా సీపీఆర్‌లో శిక్షణ పొందుతున్నారని,ఇటీవల యువతలో గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం సీపీఆర్ శిక్షణ కోసం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిందని మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇటీవల,గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ మాట్లాడుతూ, గత ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా రాష్ట్రంలో మొత్తం 1052 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బాధితుల్లో 80 శాతం మంది 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని, ఊబకాయం లక్షణాలు లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ అంబులెన్స్ (108)కి ప్రతిరోజూ 173 కంటే ఎక్కువ కార్డియాక్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయని, ఇందులో యువత ఎక్కువగా బాధితులవుతున్నారని మంత్రి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

CPR టెక్నిక్‌పై శిక్షణ పొందుతున్న మన్‌సుఖ్ మాండవీయ