Page Loader
ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ
ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

వ్రాసిన వారు Stalin
May 17, 2023
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. ఎరువుల ధరలను పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఖరీఫ్ సీజన్‌కు రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

కేంద్రం

రైతులు సకాలంలో ఎరువులు పొందడంమే తమ లక్ష్యం: మాండవీయ 

యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యూరియా భారతదేశ వార్షిక అవసరాలు కోసం 325-350 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. దేశంలోని రైతులు సకాలంలో ఎరువులు పొందడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలో వ్యత్యాసం వచ్చినప్పుడల్లా రైతులపై భారం పడకుండా, గతేడాది ప్రభుత్వ బడ్జెట్‌లో రూ.2.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. రూ.17,000 కోట్ల బడ్జెట్‌తో ఐటి హార్డ్‌వేర్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.