7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.
దేశంలో గత 24గంటల్లో 6,050 కొత్త వైరస్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. గత 200రోజుల్లో ఇదే అత్యధికమని చెప్పంది.
కొత్త కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కేరళ, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళలో ఒక్కరోజే 1,912 కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో మాండవియా ఉన్నతస్థాయి సమావేశం
వైరస్ కారణంగా దేశంలో మరో 14మంది చనిపోయారు. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,30,943కి చేరుకుంది
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కోవిడ్-19పై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తోందని కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.