NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్
    తదుపరి వార్తా కథనం
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్

    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో గత 24 గంటల్లో 5,335 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువని వెల్లడించింది.

    గత ఏడాది సెప్టెంబర్ 23 తర్వాత తొలిసారిగా రోజువారీ కేసులు 5,335 వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.

    కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.32 శాతంగా ఉంది. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసులు 25,587కు చేరుకున్నట్లు పేర్కొంది.

    మొత్తం కేసుల్లో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,826 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,41,82,538కి చేరుకుంది.

    కరోనా

    వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం సిద్ధం: కేంద్ర ఆరోగ్య మంత్రి

    గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల అధికారులను కేంద్రం అప్రమత్తం చేసింది. కేసుల పెరుగుదలను పరిష్కరించడానికి ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రభుత్వాలు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

    వైరస్ వ్యాప్తికి అరికట్ట వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

    ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని ఆయన అన్నారు.

    దేశ రాజధానిలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో నిన్న 509 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, పాజిటివ్ రేటు 26.54 శాతానికి చేరుకుంది. 15 నెలల్లో ఇదే అత్యధికం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    తాజా వార్తలు

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్

    కోవిడ్

    ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే? టీకా
    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక! భారతదేశం
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు చైనా

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి చైనా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్

    తాజా వార్తలు

    Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత టాలీవుడ్
    భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత క్రికెట్
    దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్ కోవిడ్
    కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025