కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం
దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది. కొత్త వాటితో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 23,091కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్లకు (4,47,33,719)కు చేరింది. తాజా మరణాల్లో ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, ఒడిశా, పంజాబ్‌లలో ఒక్కొక్కరు, మహారాష్ట్రలో నలుగురు వైరస్‌తో మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. నాలుగు మరణాలను కేరళ సరిదిద్దిన నేపథ్యంలో మృతల సంఖ్య 15కు చేరినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం మరణాల మరణాల సంఖ్య 5,30,916కి చేరుకుంది.
రోజూవారి పాజిటివిటీ రేటు 3.38 శాతం
గత 24 గంటల్లో మొత్తం 2,508 రికవరీలు నమోదయ్యాయి. మొత్తం రికవరీల సంఖ్య 4,41,79,712కి చేరుకుంది. క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతంగా ఉన్నాయి. రోజూవారి పాజిటివిటీ రేటు 3.38 శాతం కాగా, వారం వారీ పాజిటివిటీ రేటు 2.79శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఆరోగ్య శాఖ గత 24 గంటల్లో 1,31,086 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు మొత్తం 92.21 కోట్ల టెస్టులు నిర్వహించింది. దేశంలో మొత్తం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మొత్తం 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.