దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి
భారతదేశంలో సోమవారం 3,641 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్త కేసులతో కలిసి క్రియాశీల కేసుల సంఖ్య 20,219కి పెరిగింది. గత 24 గంటల్లో 1,800 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రికవరీలతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 44,175,135కు చేరుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు వేసినట్లు కేంద్రం పేర్కొంది.
యాక్టివ్ కేసుల పరంగా కేరళ టాప్
గత 24గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,892 కి చేరుకుంది. యాక్టివ్ కేసుల పరంగా కేరళ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. దేశంలోనే అత్యధికంగా కేరళలో 5636 యాక్టివ్ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 3488 మంది బాధితులు ఉన్నారు. గుజరాత్‌లో 2332, కర్ణాటకలో 1410, ఢిల్లీలో 1395, హిమాచల్ ప్రదేశ్‌లో 1218, తమిళనాడులో 909, హర్యానాలో 747, ఉత్తరప్రదేశ్‌లో 486, గోవాలో 680 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.