దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు
24గంటల్లో భారతదేశంలో 2,994 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది. గత రోజుతో పోల్చుకుంటే కేసులు 101 మేరకు తగ్గినట్లు వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఐదు మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,30,867కి పెరిగింది. తాజా మరణాల్లో గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కటి నమోద కాగా, ఒక్క కేరళలోనే ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది.
రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 2.61 శాతం
రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, వారంవారీ సానుకూలత 1.91 శాతంగా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్ల(4,47,15,786)కు చేరుకున్నట్లు కేంద్రం పేర్కొంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వేరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లు (4,41,69,711)కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి