దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం కాగా, వారాంతపు పాజిటివిటీ రేటు 1.91 శాతంగా నమోదైంది. కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసులు 15,000 మార్కును దాటాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,208గా ఉన్నాయి. గత 24 గంటల్లో, 1,390 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీలు 4,41,69,711కి చేరుకున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు అప్రమత్తం
గత 24గంటల్లో రోజూవారీ కేసుల కేసుల సంఖ్య దాదాపు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీలో కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దిల్లీలో కొత్త వేరియంట్ వ్యాప్తి లేదని, కరోనావైరస్ XBB వేరియంట్, ఉప వేరియంట్లే వ్యాపిస్తున్నాయని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.