దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో మంగళవారం 3,038 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి సోకి కొత్తగా మరో 9మంది మృతి చెందినట్లు పేర్కొంది.
కొత్త కేసులతో కలిసి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 21,179కు పెరిగింది.
తాజా సంభవించిన మరణాలతో కలిపి మొత్త మృతుల సంఖ్య 5,30,901కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్తగా చనిపోయిన వారిలో దిల్లీ, పంజాబ్‌లో ఇద్దరు, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో ఒకరు చొప్పున, కేరళలో రెండు మరణాలు నమోదయ్యాయి.
కరోనా
మరణాల రేటు 1.19 శాతం
కొత్త నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్ల(4,47,29,284)కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు వైరస్ కోలుకున్న వారి సంఖ్య 4,41,77,204 కు పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌లు అందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.