LOADING...
Mansukh Mandaviya: 10 నిమిషాల డెలివరీకి బ్లింకిట్ బ్రేక్… క్విక్ కామర్స్ సంస్థలకు కేంద్ర మంత్రి సూచన
క్విక్ కామర్స్ సంస్థలకు కేంద్ర మంత్రి సూచన

Mansukh Mandaviya: 10 నిమిషాల డెలివరీకి బ్లింకిట్ బ్రేక్… క్విక్ కామర్స్ సంస్థలకు కేంద్ర మంత్రి సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

త్వరిత వాణిజ్య (క్విక్ కామర్స్)సంస్థలు ఉపయోగిస్తున్న'10 నిమిషాల్లో డెలివరీ' వంటి ప్రచారాలను విరమించుకోవాలని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. గిగ్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం అవసరమని ఆయన స్పష్టం చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. గత నెల రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలతో వరుస సమావేశాలు నిర్వహించిన మంత్రి, డెలివరీ సమయాల వల్ల డెలివరీ పార్ట్‌నర్లపై పడుతున్న ఒత్తిడి అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో బ్లింకిట్, జప్టో,జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లు పాల్గొన్నాయి. డెలివరీ టైమ్‌లైన్‌ల కారణంగా గిగ్ వర్కర్ల భద్రత,పని పరిస్థితులపై పడుతున్న ప్రభావంపై చర్చ జరిగింది. డెలివరీ పార్ట్‌నర్లకు మరింత భద్రత,సెక్యూరిటీ, మెరుగైన పని వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.

వివరాలు 

గిగ్ వర్కర్ల సంక్షేమానికి సమతుల్యం తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం 

అతి వేగంగా డెలివరీ చేస్తామనే ప్రచారంతో డెలివరీ సిబ్బందిపై అనవసర ఒత్తిడి పెరుగుతోందని, అందుకే అలాంటి బ్రాండింగ్‌కు దూరంగా ఉండాలని కంపెనీలకు మంత్రి సూచించారు. ప్రభుత్వ జోక్యం తర్వాత ప్రధాన డెలివరీ అగ్రిగేటర్లు 10 నిమిషాల డెలివరీ బ్రాండింగ్, మార్కెటింగ్‌ను తొలగించేందుకు అంగీకరించినట్లు వర్గాలు తెలిపాయి. ఇతర క్విక్ కామర్స్ సంస్థలు కూడా రాబోయే రోజుల్లో ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ అంశంపై సంబంధిత కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, గిగ్ వర్కర్ల సంక్షేమానికి సమతుల్యం తీసుకురావడమే ఈ చర్య లక్ష్యమని తెలుస్తోంది.

వివరాలు 

న్యూ ఇయర్ ఈవ్ రోజున డెలివరీ రైడర్ల నిరసన

ఇటీవల ఈ రంగంలో పని పరిస్థితులపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ ఈవ్ రోజున దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా డెలివరీ రైడర్లు ఆహారం,కిరాణా సహా ఇతర ఆర్డర్లను డెలివరీ చేయకుండా నిరసన తెలిపారు. మెరుగైన వేతనం,భద్రత,గౌరవం కల్పించాలని, అలాగే అతి వేగం డెలివరీ టైమ్‌లైన్‌లకు ముగింపు పలకాలని వారు డిమాండ్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఈ సమ్మెతో అతి వేగం డెలివరీల వెనుక ఉన్న మానవ వ్యయం గురించి చర్చ మరింత వేడెక్కింది. ట్రాఫిక్‌తో నిండిన రహదారులపై వేగంగా డెలివరీ చేయాల్సిన ఒత్తిడి ప్రమాదకర ప్రవర్తనకు దారితీస్తుందని విమర్శకులు అంటున్నారు.

Advertisement

వివరాలు 

భారత్‌లో గిగ్ వర్క్‌ఫోర్స్ సంఖ్య 2030 నాటికి 2.35 కోట్లకు చేరుతుందని అంచనా

అయితే రైడర్లను అధికారికంగా టైమ్‌తో కొలవడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఈ అంశం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే అంశంపై పెట్టుబడిదారుల ఆందోళనలను కూడా పెంచింది. భారత్‌లో కొత్త కార్మిక చట్టాల కింద గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత విస్తరించాలనే చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో గిగ్ వర్క్‌ఫోర్స్ సంఖ్య 2030 నాటికి 2.35 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది పదేళ్ల క్రితం ఉన్న సంఖ్యతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడంతో, ఈ రంగంలో కార్మికుల రక్షణపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మరింత అత్యవసరంగా మారింది.

Advertisement

వివరాలు 

కేంద్రం సూచన మేరకు డోగోచ్చిన బ్లింకిట్

దీంతో ఈ అంశంపై బ్లింకిట్ ముందుగా స్పందించింది. త్వరలోనే 10 నిమిషాల డెలివరీ సదుపాయాన్ని తొలగించనున్నట్లు సమాచారం. ఇకపై కంపెనీ బ్రాండింగ్, ప్రకటనలు, యాప్‌లలో ఈ ఫీచర్ కనిపించదని తెలుస్తోంది. అలాగని, తాము ఇకపై స్లో డెలివరీ చేస్తామని కాదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మరోవైపు, గిగ్ వర్కర్ల రక్షణ, భద్రత, ఇతర సంక్షేమ ప్రయోజనాలకు సంబంధించి త్వరలోనే లేబర్ చట్టాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement