Page Loader
MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం 
MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం

MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం 

వ్రాసిన వారు Stalin
Dec 27, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో దేశవ్యతిరేక, వేర్పాటువాదస ఉగ్రవాద కార్యకలాపాలకు ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం(MLJK-MA) మద్దతిస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది. ఎంఎల్‌జేకే-ఎంఏ సంస్థ, అందులో పని చేస్తున్నవారు దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ఈ సంస్థ ప్రజలను ప్రోత్సహిస్తోందని షా ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్

మస్రత్ ఆలం ఎవరో తెలుసా? 

ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ అనేది మస్రత్ ఆలం భట్ స్థాపించిన సంస్థ. మస్రత్ ఆలం భట్ 2019 నుంచి దిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను కశ్మీరీ ఫండమెంటలిస్ట్ గ్రూప్ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ (APHC) అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. 2021లో మస్రత్ ఆలంను అధ్యక్షుడిగా ప్రకటించారు. మసరత్ ఆలం భట్ వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అతనిపై కేసు నమోదు చేసింది. 2010లో కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు జరిగాయి. ఈ ప్రదర్శనలలో అతని పాత్ర ఉందని తేల్చిన ఎన్ఐఏ అరెస్టు చేసింది.అప్పటి నుంచి అతను నిర్బంధంలో ఉన్నాడు.