
NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
అధికార వెబ్‌సైట్ www.nirfindia.org ద్వారా ర్యాంకింగ్‌లను చూసుకోవచ్చు.
తాజా ర్యాంకింగ్స్‌ను ఓవరాల్, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల పేరుతో నాలుగు కేటగిరీలుగా విభజించారు.
గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మరోసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2023లో విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
జేఎన్‌యూ రెండోస్థానం, జామియా మిలియా మూడవ స్థానాల్లో నిలిచాయి.
'ఓవరాల్' విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందింది.
అంతర్జాతీయ స్థాయిలో దేశీయ విద్యాసంస్థలు గుర్తింపు పొందడానికి ఈ ర్యాంకింగ్స్ దోహదపడుయి.
విద్య
'ఓవరాల్' కేటగిరీలో టాప్ 10 ఇన్‌స్టిట్యూట్‌లు
ర్యాంక్ 1: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్
ర్యాంక్ 2: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు
ర్యాంక్ 3: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ) దిల్లీ
ర్యాంక్ 4: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి
ర్యాంక్ 5: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్
ర్యాంక్ 6: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)
ర్యాంక్ 7: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్
ర్యాంక్ 8: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ
ర్యాంక్ 9: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి
ర్యాంక్ 10: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)
ర్యాంకు
దేశంలోని టాప్-10 విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్‌కు చోటు
ర్యాంక్ 1: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
ర్యాంక్ 2: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ
ర్యాంక్ 3: జామియా మిలియా ఇస్లామియా, దిల్లీ
ర్యాంక్ 4: జాదవ్‌పూర్ యూనివర్సిటీ కోల్‌కతా
ర్యాంక్ 5: బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
ర్యాంక్ 6: మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
ర్యాంక్ 7: అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
ర్యాంక్ 8: వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్
ర్యాంక్ 9: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్ ర్యాంక్
10: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర విద్యాశాఖ ట్వీట్
🏆 India Rankings 2023 🇮🇳
— Ministry of Education (@EduMinOfIndia) June 5, 2023
Presenting the top 5 Higher Education Institutions in India! 🔝@dpradhanbjp @RanjanRajkuma11 @Drsubhassarkar @Annapurna4BJP pic.twitter.com/3N4vt2dEtH