Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం
తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందానికి ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వం వహిస్తారు. బృందంలో వ్యవసాయం, ఆర్థిక, జల శక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, హైవేలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
కేంద్ర బృందం రాకపై కిషన్ రెడ్డి ట్వీట్
భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోవడంతో శనివారం నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహాయక చర్యలను పర్యవేక్షించారని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో మాట్లాడినట్లు శనివారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.