Piyush Goyal: అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల దిగుమతులు.. భారత్‌కి పెద్ద సమస్య కాదు : పీయూష్ గోయల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.45 లక్షల కోట్ల) విలువైన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఇది భారత్‌కు ఎలాంటి ఇబ్బందిని కలిగించదని స్పష్టంచేశారు. వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల డిమాండ్‌ను సృష్టిస్తున్నందున, 500 బిలియన్ డాలర్ల దిగుమతి లక్ష్యం చాలా తక్కువదని గోయల్ పేర్కొన్నారు.
Details
రాబోయే ఐదేళ్లలో రెండు ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం
భారత్ ప్రస్తుతం ఏటా ఇతర దేశాల నుంచి సుమారుగా 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ డిమాండ్‌లో కొంత భాగాన్ని అమెరికా నుంచి కూడా పొందవచ్చు. మొత్తం దిగుమతుల డిమాండ్ రాబోయే ఐదేళ్లలో రెండు ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది అమెరికా అధికారులకూ వివరించాము. మార్కెట్ విషయంలో పోటీతత్వం ఉండేలా సూచించామని తెలిపారు. అగ్రరాజ్యం (USA) నుంచి భారత్ ఇప్పటికే ఏటా 45-50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని గోయల్ వివరించారు. భారతదేశంలో 0 గిగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు జరుగుతుంది. వాటి కోసం అవసరమైన పరికరాలను అమెరికా సమకూర్చగలదు.
Details
అమెరికా నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల దిగుమతులు
అలాగే, విమాన పరిశ్రమకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి. ఒక్క బోయింగ్ కంపెనీ నుంచి మన దేశం 50 బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఇచ్చిందని ఆయన చెప్పారు. డేటా సెంటర్లు, ఏఐ మిషన్, తయారీ రంగం ఖనిజాల ప్రాసెసింగ్‌కు అధిక నాణ్యత కలిగిన యంత్రాలు ఐసీటీ ఉత్పత్తులు, ఎన్విడియా చిప్‌లు క్వాంటం కంప్యూటింగ్ కోసం ఏఐ యంత్రాలు ఉక్కు పరిశ్రమలకు కోకింగ్ బొగ్గు అందువల్ల 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు, అమెరికా నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ అంచనానేని గోయల్ పేర్కొన్నారు.