కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం
కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది. అర్జున్ రామ్ మేఘవాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ శాఖను ప్రభుత్వం అప్పగించింది. కిరెన్ రిజిజు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు. రిజిజు ఇప్పుడు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖను చేపట్టనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, బికనీర్ ఎంపీ అయిన మేఘవాల్ అంతకుముందు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.