ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం
దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది. సదరు మెడిసిన్స్ అనారోగ్యం కలిగించే ప్రమాదం ఉందంటూ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు భారత సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ అంటే రెండు లేదా అంతకుమించిన యాక్టివ్ ఇంగ్రేడియెంట్స్ (కాంపౌండ్స్)ల కూడిన మిశ్రమం. ఇందులో డోసేజ్ కూడా ఫిక్స్ డ్ గానే ఉంటుంది. ప్రజల విస్త్రృత ప్రయోజనాల రీత్యా వీటి తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నామని తన నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది.
నిషేధానికి గురైన మందులు ఇవే..
1. నిమెసులైడ్, ప్యారాసెటమాల్ డిస్పర్సబుల్ ట్యాబ్లెట్లు 2. అమోక్సిసిల్లిన్, బ్రొమెహెక్సైన్ 3. ఫోల్కోడిన్, ప్రొమెథజైన్ 4. క్లోర్ ఫెనిరమైన్ మైలేట్, డెక్ట్రో మెథార్ఫన్, గ్వైఫెన్సిస్, అమ్మోనియం క్లోరైడ్, మెంథాల్ 5. క్లోర్ ఫెనిరమైన్ మైలేట్, కోడీన్ సిరప్ 6. అమ్మోనియం క్లోరైడ్, బ్రొమ్ హెక్సైన్, డెక్ట్రోమెథార్ఫన్ 7. సాల్బూటమాల్, బ్రొమెహెక్సైన్, క్లోరోఫెనిరమైన్ మైలేట్, గ్వైఫెన్సిన్ తదితర కాంబినేషన్ ఔషధాలు కేంద్రవైద్య ఆరోగ్యశాఖ నిషేధించిన జాబితాలో ఉండటం గమనార్హం.