మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి BGMI గేమ్ రీ ఎంట్రీ
ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత్ లోకి తిరిగి ప్రవేశించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి యూజర్లు ఈ గేమ్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత గేమింగ్ లవర్స్ కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో.. క్రాప్టన్ సంస్థ కొన్ని మార్పులు చేసింది. గేమ్ ఆడేందుకు టైమ్ లిమిట్ ను పెట్టడం గమనార్హం. బీజీఎంఐను గతంలో ఎంతసేపైనా ఆడటానికి వీలు ఉండేంది. ఇకనుంచి 18 సంవత్సరాల వయస్సు లోపు వారు రోజుకు మూడు గంటలు మాత్రమే ఈ గేమ్ ఆడగలరు.
మూడు నెలల పాటు అనుమతి ఇచ్చిన కేంద్రం
18 సంవత్సరాల కంటే పైన ఉంటే గరిష్టంగా ఆరు గంటలు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్నా అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాదని క్రాప్టన్ సంస్థ ధ్రువీకరించింది. రానున్న 48 గంటల్లో దశలవారీగా యూజర్లకు గేమ్ ఆడేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. పబ్ జీ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ గేమ్ గతేడాది నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పున:ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలలు పర్మిషన్ ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలియజేశారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి