China pneumonia: చైనా న్యుమోనియా భయాలు.. ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఆదివారం కీలక సూచనలు చేసింది.
దేశంలో ఆసుపత్రుల సంసిద్ధతపై వెంటనే సమీక్షించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
హాస్పిటల్ బెడ్‌లు, మందులు, ఇన్‌ఫ్లుఎంజా కోసం వ్యాక్సిన్‌లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్‌లు వంటి వైద్య మౌలిక సదుపాయాలను అవసరమైనవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్య
ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది: కేంద్ర ఆరోగ్య శాఖ
చైనాలో మైకోప్లాస్మా న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా ఫ్లూ కేసులు ముఖ్యంగా చిన్నారుల్లో పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.
చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులను ICMR, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ఇన్‌ఫ్లుఎంజా కారణంగా తలెత్తే ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చైనాలోని పిల్లలలో H9N2 వ్యాప్తి, శ్వాసకోశ వ్యాధులను కూడా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.