హోంశాఖ మంత్రి: వార్తలు

02 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి 

మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.

'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ

కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని గొడవ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారిపోయింది.

మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది.

West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.

ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.

24 Mar 2023

కేరళ

'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం

కేరళ రాష్ట్ర కళా వారసత్వంగా భావించే శాస్త్రీయ నృత్య రూపం 'కథాకళి'కి అరుదైన గౌరవం లభించింది. ఒక గ్రామానికి 'కథాకళి' పేరును అంకితం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంలో ముగిపోతున్నారు.

అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం

అగ్నిపథ్ పథకంలో భాగంగా నియామకయ్యే అగ్నివీరులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వారి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది.

22 Feb 2023

దిల్లీ

దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి

ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.

జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.

13 Jan 2023

దిల్లీ

దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం

రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.