Page Loader
మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
మణిపూర్ నిర్వాసితుల రూ.101 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన కేంంద్రం

మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Stalin
Jun 09, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్‌లో జాతి హింస కారణంగా నిర్వాసితులైన ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.101.75 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మే 29 నుంచి జూన్ 1 వరకు మణిపూర్‌లో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా, ఎంహెచ్‌ఏకు సహాయ ప్యాకేజీ కోసం ప్రతిపాదన పంపాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.

మణిపూర్

ఇప్పటివరకు 896 అధునాతన ఆయుధాలు స్వాధీనం

గత 24 గంటల్లో మరో 27 ఆయుధాలు, 245 మందుగుండు సామగ్రిని మణిపూర్ భద్రతా వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్‌లోని భద్రతా దళాలు ఇప్పటివరకు 896 అధునాతన, ఆటోమేటిక్ ఆయుధాలను, 11,763 మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని అధికారులు చెప్పారు. వివిధ జిల్లాల నుంచి 200 లైవ్ బాంబులను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐదు లోయ జిల్లాల్లో 12 గంటలు, పొరుగున ఉన్న కొండ జిల్లాల్లో 10 గంటల ఎనిమిది గంటల పాటు కర్ఫ్యూను సడలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమెంగ్‌లాంగ్, నోనీ, సేనాపతి, ఉఖ్రుల్, కామ్‌జోంగ్‌తో సహా మరో ఆరు కొండ జిల్లాల్లో కర్ఫ్యూ లేదు.