Page Loader
మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

వ్రాసిన వారు Stalin
May 03, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది. కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో చర్చించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిల్లెట్స్ మెనూను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాయుధ విభాగాధిపతులను ఎంహెచ్‌ఏ కోరింది.

హోంశాఖ

మిల్లెట్ వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై బలగాలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. క్రమ పద్ధతిలో మిల్లెట్‌లను భోజనంలో ప్రవేశపెట్టడానికి సాయుధ విభాగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్, క్యాంపస్‌లలోని కిరాణా దుకాణాలు, రేషన్ దుకాణంలో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మిల్లెట్‌లను అందుబాటులో ఉంచుతామని ఎంహెచ్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది. మిల్లెట్ ఆధారిత వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మిల్లెట్ల వాడకంపై సైనికులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి, డైటీషియన్లు, నిపుణుల ఏజెన్సీల సేవలను ఉపయోగించుకుంటామని హోంశాఖ పేర్కొంది.