
హైదరాబాద్ కు అమిత్ షా.. డైరెక్టర్ రాజమౌళితో భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అమిత్ షాతో అగ్రదర్శకుడు రాజమౌళి తో మర్యాదపూర్వకమైన భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
అయితే కమలదళాన్ని ఉర్రూతలూగించి రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండాను ఎగరేయాలన్న లక్ష్యంతో జాతీయ నేతలు ముందుకుసాగుతున్నారు.
అసలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి స్థానమే లేదని, ఇప్పటికే అధికార పక్షం బీఆర్ఎస్ అటు విపక్షం కాంగ్రెస్, భాజపాకు సవాళ్లు విసిరాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ భాజపా శాఖ ఈనెల 15న ఖమ్మంలో బలప్రదర్శనకు దిగుతోంది.
DETAILS
ఖమ్మం షెడ్యూల్ కు ఒక రోజు ముందే హైదరాబాద్ కు అమిత్ షా రాక
భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రికి హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు శంషాబాద్ లోని నోవాటేల్ హోటల్‌ల్లో షా బస చేయనున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అనంతరం గురువారం ఉదయం టాప్ డైరక్టర్ రాజమౌళితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ 5 భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్‌ని మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలవనుండటంపై ఉత్కంఠ నెలకొంది.
DETAILS
గురువారం భద్రాద్రి సీతారాములను దర్శించనున్న అమిత్ షా
గత కొద్దికాలంగా అమిత్ షా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతూ వస్తున్నారు. గతంలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నితిన్ సహా స్పోర్ట్స్ రంగానికి చెందిన స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌లను షా కలివడం గమనార్హం.
అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్డ్
గురువారం లంచ్ తర్వాత స్పెషల్ హెలికాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లనున్న అమిత్ షా, అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు.
తొలుత జూన్ 15న ఒక్కరోజే అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. అయితే అనూహ్యంగా మార్పులు జరిగి 14న రాత్రికే షా హైదరాబాద్ రానుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.