Page Loader
13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన

13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన

వ్రాసిన వారు Stalin
Feb 11, 2024
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF- సీఎపీఎఫ్)లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్షలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ మార్పులు చేసింది. ఇప్పుడు SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ పాటు 13 విభిన్న భాషల్లో నిర్వహించనున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఆదివారం ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7, 2024 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.

కేంద్రం

128 నగరాల్లో పరీక్ష నిర్వహణ

SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షను 128 నగరాల్లో నిర్వహిస్తున్నారు. దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సీఎపీఎఫ్‌లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంహెచ్ఏ తెలిపింది. సీఏపీఎఫ్‌ పరిధిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల లక్షలాది మంది యువత తమ మాతృభాషలో పరీక్ష రాయడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది.