Anitha: ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్‌గా బ్రేడ్ చేశారు. దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మరో వాహనంలో వెళ్లిపోయిన అలంపూర్
ఈ ఘటనతో ఆమె మరో వాహనంలో అలంపూర్ వెళ్లిపోయారు. ప్రమాదంలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. అనిత్ కు పెను ప్రమాదంలో తప్పడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బైకును తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు.