Page Loader
అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం
బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం

అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Stalin
Mar 10, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్నిపథ్ పథకంలో భాగంగా నియామకయ్యే అగ్నివీరులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వారి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది. సరిహద్దు భద్రతా దళం చట్టం, 1968లోని సెక్షన్ 141లోని సబ్ సెక్షన్ (2)లోని క్లాజులు (బీ), (సీ) అధికారాలను అనుసరిస్తూ.. ఈ మేరకు కొన్ని సవరణలు చేసింది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అనంతరం రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

అగ్నవీర్

మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్ ఈవెంట్స్‌లో వినహాయింపు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డ్యూటీ కేడర్ (నాన్-గెజిటెడ్) (సవరణ) రిక్రూట్‌మెంట్ రూల్స్- 2023లో భాగంగా మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్ ప్రావీణ్యత పరీక్ష నుంచి మినహాయింపును కూడా ఇచ్చారు. అగ్నివీర్ మొదటి బ్యాచ్ ఐదేళ్లు పని చేయాల్సి ఉంటుంది. దీంతో వీరికి ఆ తర్వాత ఐదేళ్ల వరకు వయోపరిమితో కూడిన సడలింపు ఇచ్చారు. రెండు బ్యాచ్ నుంచి మూడేళ్ల వరకు వయోపరిమితో కూడిన సడలింపు ఇచ్చారు. ఇంతకు ముందు పారా మిలిటరీ బలగాలలో 10 శాతం రిజర్వేషన్‌ను మాజీ అగ్నివీరులకు కేంద్రం ప్రటించింది. అస్సాం రైఫిల్స్ రక్షణ దళాల్లో కూడా వీరికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.