NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్
    కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా

    అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 26, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యులు సహా ప్రముఖులనూ విడిచిపెట్టట్లేదు. ఈ క్రమంలో అశ్లీల కాల్స్ చేసే ఓ ముఠా ఏకంగా కేంద్రమంత్రికే వీడియో కాల్ చేసింది.

    అంతటితో ఆగకుండా సెంట్రల్ మినిస్టర్ ను లొంగదీసికునేందుకు ప్రయత్నించారు. పదేపదే అశ్లీలంగా వీడియోకాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఫలితంగా ముఠాలోని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.

    కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఫోన్ కు వాట్సాప్‌ ద్వారా గత వారం ఓ వీడియో కాల్‌ వచ్చింది. ఎప్పటిలాగే ఫోన్ లిఫ్ట్ చేసిన మంత్రికి అది అశ్లీల వీడియో కాల్‌ అని అర్థమై కాల్ కట్ చేశారు.

    details

    ప్రత్యేక బృందాలను పంపించి అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

    వెంటనే వ్యక్తిగత కార్యదర్శిని పిలిపించి ఆయా వివరాలను అందజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు అశ్లీల వీడియో కాల్ పై కేసు నమోదు చేశారు.

    అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

    అక్కడికి ప్రత్యేక బృందాలను పంపించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ (COMMISSIONER OF POLICE) వెల్లడించారు.

    అసలు ఏం జరిగిందంటే :

    మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేసిన వెంటనే అందులోని దృశ్యాలను చూసి మంత్రి ఫోన్ కట్‌ చేశారు.

    DETAILS

    వీడియో కాల్‌ దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేస్తామని మంత్రికి బ్లాక్‌ మెయిల్‌ 

    మరోసారి మంత్రి ఫోన్‌కు వేరే నంబర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అంతకముందు వీడియో కాల్‌ దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేశారు.

    ఈ సంఘటనపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి(PS) అలోక్‌ మోహన్‌ వివరించారు.

    సులువుగా డబ్బు సంపాదించేందుకు నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి అశ్లీల వీడియో కాల్స్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌ కార్యకలాపాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    కేంద్రమంత్రి

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    దిల్లీ

    భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం వర్షాకాలం
    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  వర్షాకాలం
    దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా  వర్షాకాలం

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025