Russia: ఆంక్షల తర్వాత రష్యా డిస్కౌంట్ గేమ్.. ఉరాల్స్ క్రూడ్‌పై బ్యారెల్‌కు $7 తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా, అమెరికా ఆంక్షల ఒత్తిడిలో భారత్‌కి ముడి చమురు ధరలు భారీగా తగ్గించింది. రోస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై US ఆంక్షలు వచ్చిన తర్వాత, భారత రిఫైనరీలకు రష్యన్ క్రూడ్‌ను గట్టి డిస్కౌంట్‌తో ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. డేటెడ్ బ్రెంట్‌తో పోలిస్తే ఉరాల్స్ చమురు ధర బ్యారెల్‌కు సుమారు ఏడు డాలర్లు తగ్గి, డిసెంబర్‌లో లోడింగ్ అయ్యే, జనవరిలో భారత్ చేరే కార్గోలు ఇలా అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
ఇండియన్ రిఫైనర్లు రష్యన్ చమురుకు కొత్త ఆర్డర్లు
ఈ ఆంక్షల ప్రభావం రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై స్పష్టంగానే కనిపిస్తోంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగిన ఈ వ్యాపారం, తాజా ఆంక్షలతో కుదేలైంది. గత వారం నుంచి ఆంక్షలు అమల్లోకి రావడంతో, చాలామంది ఇండియన్ రిఫైనర్లు రష్యన్ చమురుకు కొత్త ఆర్డర్లు పెట్టడాన్ని తగ్గించారు. అయితే ఇప్పుడు ఉరాల్స్ ధర పడిపోవడంతో, బ్లాక్‌లిస్ట్‌లో లేని సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని కొంతమంది రిఫైనర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాలు
ఉరాల్స్‌పై బ్యారెల్‌కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్
అయితే ఇదంతా ఉన్నా, ఆఫర్‌లో ఉన్న చమురు కార్గోలలో కేవలం ఐదోవ వంతు మాత్రమే బ్లాక్‌లిస్ట్‌లో లేని కంపెనీలవి కావడం పెద్ద సవాలుగానే ఉంది. ఆంక్షల ముందు ఉరాల్స్‌పై బ్యారెల్‌కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆంక్షలు పెరగడంతో భారత రిఫైనరీలు సరఫరాలో లోటు రాకుండా మధ్య ప్రాచ్యం వంటి ఇతర ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుతున్నాయి.