LOADING...
Russia: చమురు విషయంలో భారత్ లాభమే లక్ష్యం: రష్యా అధ్యక్ష భవనం వ్యాఖ్య 
చమురు విషయంలో భారత్ లాభమే లక్ష్యం: రష్యా అధ్యక్ష భవనం వ్యాఖ్య

Russia: చమురు విషయంలో భారత్ లాభమే లక్ష్యం: రష్యా అధ్యక్ష భవనం వ్యాఖ్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ఒక సంపూర్ణ సార్వభౌమ దేశమని, తనకు ఆర్థికంగా లాభదాయకంగా అనిపించిన చోట నుండి చమురు కొనుగోలు చేయడంలో దేశానికి పూర్తి స్వేచ్ఛ ఉందని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ స్పష్టం చేసింది. భారత్‌ ఎప్పటికీ తన ఆర్థిక ప్రయోజనాలను ప్రధానంగా చూసుకుంటూ నిర్ణయాలు తీసుకునే విధానానికే కట్టుబడి ఉంటుందని తమకు నమ్మకముందని తెలిపింది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నదన్న అసంతృప్తితో అమెరికా భారతదేశం నుంచి రాగుతున్న ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అనంతరం అదే నెల చివరికి ఆ సుంకాల రేటును 50 శాతానికి పెంచింది.

వివరాలు 

భారత్‌కు విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగా రష్యా  కొనసాగుతుంది  

ఇటీవల భారత్‌లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా చమురు సరఫరా అంశాన్నీ ప్రస్తావిస్తూ, భారత్‌కు విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ సోమవారం మాట్లాడుతూ, "నాకు తెలిసినంతవరకు భారత్‌ తన ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతుంది" అని వ్యాఖ్యానించారు.

Advertisement