LOADING...
Russia-Ukraine war updates: అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు
అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు

Russia-Ukraine war updates: అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు యత్నాల భాగంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు యూఏఈ రాజధాని అబుధాబీలో రెండో రోజు కూడా కొనసాగాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగుతున్నఈ రెండో రౌండ్‌లో ఇప్పటివరకూ ఏ విషయాలపై ఒప్పందం జరిగింది అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ చర్చల్లో పాల్గొన్నవారిలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్,అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, నాటో సుప్రీం అలైడ్ కమాండర్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ తదితరులు ఉన్నారు. అబుధాబీలోనే గత నెల్లో జరిగిన తొలి రౌండ్‌ సమాలోచనల్లోనూ విట్కాఫ్, కుష్నర్‌ పాల్గొన్న సంగతి గమనార్హం.

వివరాలు 

రష్యా-అమెరికా మధ్య కీలక అంగీకారం

ఇక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ సైనిక నష్టాల విషయానికొస్తే,ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రస్తుతానికి తమ సైనికుల్లో సుమారు 55,000 మంది అమరులయ్యారని తెలిపారు. ఇంకా అనేక మంది సైనికుల పరిస్థితి తెలియరాలనేది ఆయన తెలిపారు. రష్యా,అమెరికా,తమ మధ్య ఉన్న ఉన్నత స్థాయి సైనిక కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకున్నాయి అబుధాబీలో రష్యా, అమెరికా,ఉక్రెయిన్‌ సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ కీలక అంగీకారం కుదిరింది. అమెరికా ఐరోపా కమాండ్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ చర్య దీర్ఘకాలిక శాంతిని స్థాపించేందుకు సహాయపడుతుందని వారు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు 2021లో రష్యా,అమెరికా తమ మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ-మిలిటరీ కమ్యూనికేషన్‌ను సస్పెండ్‌ చేసుకున్న సంగతి గమనార్హం.

Advertisement