LOADING...
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!
ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన '28 పాయింట్ల ప్రణాళిక' ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రణాళికపై అమెరికా అధికారులు గురువారం కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్‌స్కీతో సమావేశమై చర్చించారు. వారం రోజుల్లో ఈ ప్రణాళికను అంగీకరించాల్సిందేనని అమెరికా స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పందించిన జెలెన్‌స్కీ, ఈ విషయంపై ట్రంప్‌తో నేరుగా మాట్లాడతానని తెలిపారు. అయితే ప్రణాళికలో ఉన్న కఠిన నిబంధనల కారణంగా దాన్ని అంగీకరించడానికి జెలెన్‌స్కీ ముందుగానే నిరాకరించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రకారం, ఉక్రెయిన్‌ తమ భూభాగంలోని కొన్ని ముఖ్య ప్రాంతాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇదే జెలెన్‌స్కీకి అంగీకారయోగ్యం కాని అంశం.

Details

ఈ ప్రణాళికపై పుతిన్ సంతృప్తి

అవసరమైతే అమెరికాతో సంబంధాలను కూడా పునర్విమర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. 'ఉక్రెయిన్‌ ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళ్తాను... అవసరమైతే మిత్రులను కూడా వదులుకోగలన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారని వార్తలు చెబుతున్నాయి. ఇక పుతిన్ మాత్రం ఈ ప్రణాళిక పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను తప్పక అంగీకరించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. 'ఉక్రెయిన్ మరియు నాటో దేశాలు తమ భ్రమల నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. 'రష్యాను యుద్ధంలో ఓడించగలమని కలగంటున్నారని విమర్శించారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా సిద్ధంగా ఉందని, ట్రంప్ ప్రణాళికపై వివరమైన చర్చలకు కూడా అంగీకరిస్తున్నామని తెలిపారు. అది సాధ్యపడకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.

Details

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యం 

2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని ముగించడానికి ఆయన పలు ప్రయత్నాలు చేశారు. మొదట సౌదీ అరేబియా వేదికగా అమెరికా పలు చర్చలు జరిపింది, కానీ ఫలితం రాలేదు. తర్వాత అలాస్కాలో ట్రంప్-పుతిన్ శాంతి చర్చలు జరిగాయి. అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. అయితే ఈ చర్చలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ మరోసారి 28 పాయింట్ల కొత్త ప్రణాళికను సమర్పించారు. ఈ దారిలోనైనా శాంతి ఒప్పందం కుదరాలనే లక్ష్యంతో అమెరికా కృషి చేస్తోంది. దీనిలో భాగంగా అమెరికా సైన్య కార్యదర్శి డాన్ డ్రిస్కాల్ కైవ్‌లో జెలెన్‌స్కీని కలసి రష్యా అభ్యర్థనలు అంగీకరించాలని ఒత్తిడి తీసుకొచ్చారు.

Details

 ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికలో ప్రధాన అంశాలు 

ఉక్రెయిన్ డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలి ఉక్రెయిన్ సైన్యాన్ని 6 లక్షల దాకా తగ్గించాలి ఉక్రెయిన్ రక్షణకు యూరోపియన్ ఫైటర్ జెట్‌లు పోలాండ్‌లో మాత్రమే ఉండాలి ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి నాటో దళాలు ఉండకూడదు ఈ నిబంధనలు ఉక్రెయిన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా ఉండటంతో జెలెన్‌స్కీ పూర్తిగా అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర సందర్భాలు ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్-గాజా మధ్య ట్రంప్ తెచ్చిన 10 పాయింట్ల శాంతి ప్రణాళిక విజయవంతమై, అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ విజయంతో ఉత్సాహంగా ట్రంప్ ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వివాదానికి 28 పాయింట్ల ప్రణాళికను తీసుకురావడం గమనార్హం. ఈ చర్చలు సక్సెస్ అయితే ట్రంప్‌కు భారీ క్రెడిట్ లభిస్తుంది.