బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల
మాస్ దేవుడు బాలకృష్ణ, సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. చివరగా ఈ సినిమాలో ఒక పాటను రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరించారు. బాలయ్య, శృతిహాసన్ ల మధ్య వచ్చే ఈ సాంగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది. ఐతే ఈ సినిమా సెట్స్ లోకి అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. దాంతో వీరసింహారెడ్డి చిత్రబృందం ఆనందంలో ఉంది. బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్, సినిమా బృందంతో ఫోటో దిగారు. బాలయ్యతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలయ్యను కలవడానికి కారణం
ఇలా సడెన్ గా కలవడానికి గల కారణం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇది రాజకీయాల గురించి కావచ్చని అంటుంటే, మరికొందరు అన్ స్టాపబుల్ షో గురించి అంటున్నారు. అన్ స్టాపబుల్ షోలోకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ వస్తారని అనుకుంటున్నారు. పై కారణాలను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా హరిహర వీరమల్లు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో పక్కనే బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతుండడంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారని తెలుస్తోంది.