2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే
సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు. దానివల్లే ప్రపంచంలో సినిమా ప్రేక్షకులందరిలో తెలుగు ప్రేక్షకులు వేరు అని చాలామంది సెలెబ్రిటీలు అంటుంటారు. అందుకే తెలుగులోకి డబ్బింగ్ సినిమాలు వెల్లువలా వస్తుంటాయి. 2022 సంవత్సరంలో కూడా తెలుగు బాక్సాఫీసు వద్ద డబ్బింగ్ సినిమాలు కళకళలాడాయి. కాకపోతే మునుపటి కంటే పోల్చితే 2022లో డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు బాక్సాఫీసు మీద చాలా తక్కువగా ఉంది. తెలుగు మార్కెట్ పెరగడంతో విస్తృతమైన కథలు తెలుగులోనే వస్తున్నాయి. ఐతే ఈ సంవత్సరం తెలుగు తెర మీద మెరిసిన డబ్బింగ్ హీరోలు ఎవరో చూద్దాం.
డబ్బింగ్ హీరోల హవా
ముందుగా కేజీఎఫ్ 2 గురించే చెప్పుకోవాలి. కేజీఎఫ్ మొదటి ఛాప్టర్ విజయం కావడంతో వీరలెవెల్లో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. అలాగే హీరో యష్ కి కూడా. తెలుగులో ఈ సినిమా 73కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. కమల్ హాసన్: చాలారోజుల తర్వాత తెలుగు తెరమీద తన విజయ సంతకాన్ని విక్రమ్ మూవీతో చేసాడు కమల్ హాసన్. దీనివల్ల ఇండియన్ 2 సినిమా మీద అంచనాలు పెరిగాయి. కాంతారా: ఈ సినిమా గురించి, ఇందులో హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలేమీ అంచనాలు లేకుండా రిలీజై దుమ్ము దులిపింది. లవ్ టుడే: ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.