ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ
ఈ వార్తాకథనం ఏంటి
ఇడియట్.. రవితేజ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటివరకు వెండితెర మీద ఎన్నో సినిమాల్లో కనిపించినప్పటికీ ఇడియట్ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు రవితేజ.
2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని డైలాగ్ లు మాస్ జనాన్ని ఎంతలా ఉర్రూతలూగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని డైలాగులు కొన్ని కొన్ని సినిమాల్లో వినిపిస్తుంటాయి. ఇడియట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలను చేసాడు రవితేజ.
గత కొన్ని రోజులుగా ఇడియట్ సినిమా సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా తన కొడుకు మహాదన్ భూపతి రాజు హీరోగా ఉంటుందని అన్నారు.
రవితేజ
రవితేజ కొడుకు పరిచయంపై పుకార్లు
రాజా ది గ్రేట్ సినిమాలో మహాదన్ నటించాడు. హీరోగా ఇండియట్ 2 సినిమాతో లాంచ్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని, అసలు అలాంటి ఆలోచనే లేదని రవితేజ తేల్చేసాడు.
తన కొడుకు గురించి ఇలాంటి పుకార్లు ప్రచారంలో ఉన్నాయన్న సంగతి కూడా తెలియదని రవితేజ చెప్పుకొచ్చారు. మహాదన్ ని హీరోగా లాంచే చేసే సమయం ఇంకా రాలేదని అన్నారు.
రవితేజ ప్రస్తుతం ధమాకా సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా, బాక్సాఫీసు దగ్గర దుమ్ము దులుపుతోంది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. ఈ ఏడాది చివర్లో రవితేజకు ధమాకా తో దొరికింది.