NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది
    తదుపరి వార్తా కథనం
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది
    వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజ

    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 29, 2022
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ నేపథ్యంలో ప్రచారాన్ని గట్టిగా మొదలెట్టింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేసింది. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ప్రస్తుతం నాలుగవ పాటని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ తో స్టెప్పులు వేయనున్నారు రవితేజ. డిసెంబర్ 30వ తేదీన పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

    ఈ సినిమాలో రవితేజ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రవితేజ మీద చిన్న గ్లింప్ల్ వీడియోని వదిలారు.

    వాల్తేరు వీరయ్య

    తెలంగాణ యాసలో రవితేజ డైలాగులు

    మేకపిల్లను ఎత్తుకుని పులి వచ్చిందనే డైలాగ్ తో వదిలిన రవితేజ గ్లింప్స్, అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో రవితేజ పలికిన డైలాగులు ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి.

    పూనకాలు లోడింగ్ పాట రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ చిరంజీవి, రవితేజ స్టెప్పులేస్తున్న ఫోటోను విడుదల చేస్తారు. ఈ ఫోటో చూస్తుంటే నిజంగా పూనకాలు వచ్చేలా కనిపిస్తుంది.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.

    మెగాస్టార్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపిస్తోంది. సంక్రాంతి పండక్కి వస్తున్న వాల్తేరు వీరయ్య ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టాలీవుడ్
    చిరంజీవి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025